![]() |
![]() |

బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడియన్స్ ముందు రావడానికి సిద్ధమైపోయింది. ఇక ప్రోమోల హడావిడి కూడా సోషల్ మీడియాలో మొదలయ్యింది. ఆల్రెడీ ఒక ప్రోమో రిలీజై హల్చల్ చేస్తోంది. అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా దుమ్ము రేపడానికి రాబోతోంది. ఇక ఈ ప్రోమో చూస్తే సీజన్ 1 లో ఉన్నవాళ్లే ఉన్నారు. హోస్ట్ గా శ్రీముఖి. జడ్జెస్ గా బిందు మాధవి, అభిజిత్, నవదీప్.
శ్రీముఖితో పాటు మిగతా ముగ్గురు కూడా ఇంట్రోస్ ని మంచి పవర్ ఫుల్ గా చెప్పారు. "మిస్సైల్ లాంచ్ చేయాలంటే టెస్ట్ ఫైర్ చేయాలి. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాలంటే అగ్ని పరీక్ష నెగ్గాలి " అని శ్రీముఖి జోష్ తో చెప్పింది. "ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ప్రతీ టాస్క్ తూఫాన్ లా చుట్టేస్తోంది " అంటూ బిందు మాధవీ చెప్పింది. "మీరే మీ బలం మీరే మీ బలగం " అంటూ అభిజిత్ చెప్పాడు. "మీరే మీ సైన్యం మీరే మీ వ్యూహం " అంటూ చిన్న కత్తిని చేతిలో పట్టుకుని నవదీప్ కసితో ఈ డైలాగ్ చెప్పాడు. "అందుకే ఈసారి అగ్ని పరీక్ష అందరినీ నిప్పుల్లో ఆయుధంలా మారుస్తుంది" అంటూ శ్రీముఖి ఫైనల్ టచ్ ఇచ్చింది.
ఇక నిజం చెప్పాలంటే బిగ్ బాస్ కంటే అగ్ని పరీక్షకి రేటింగ్ బాగా వచ్చింది. సీజన్ 1 బాగా ఎంటర్టైన్ చేసింది ఆడియన్స్ ని . అందులోనూ జడ్జెస్ కూడా టఫ్ టాస్కులు ఇచ్చి కంటెస్టెంట్స్ లో కసిని పెంచారు. దాంతో సీజన్ 1 టీమ్ నే మళ్ళీ సీజన్ 2 కి కూడా సెట్ చేసేసారు. మరి కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఇంకా క్లారిటీగా తెలీలేదు. ఆగష్టు 15 నుంచి అగ్ని పరీక్ష టెలికాస్ట్ కాబోతోంది.
![]() |
![]() |